🏠 cm9news.in
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 12:06 pm Posted by : CM9NEWS

కావలిలో పరిషత్ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ!

News Image
ముఖ్యమైన పాయింట్స్:కావలిలో పరిషత్ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ!కావలి నియోజకవర్గంలో 4 జడ్పీటీసీ, 4 ఎంపీపీ, 47 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
CM9NEWS: కావలి: పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. కావలి నియోజకవర్గ పరిధిలో మొత్తం 4 జడ్పీటీసీ, 4 ఎంపీపీ, 47 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు సంబంధించి అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో పోలీసు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహిస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పలువురు రౌడీషీటర్లను అధికారులు బైండోవర్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
🏠 Home