🏠 cm9news.in
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 2:20 pm Posted by : CM9NEWS

జెడ్పీ చైర్మన్‌ రేసులో మాజీ ఎమ్మెల్యే వంటేరు!

News Image
ముఖ్యమైన పాయింట్స్:జెడ్పీ చైర్మన్‌ రేసులో మాజీ ఎమ్మెల్యే వంటేరు!నెల్లూరు రూరల్‌ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు
CM9NEWS: నెల్లూరు: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి రేసులో కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గురువారం ఆయన నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆయనకు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించి, నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి వంటేరు వేణుగోపాల్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.గతంలో కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన వంటేరు వేణుగోపాల్‌రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగడంతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన అభిమానుల్లోనూ సందడి కనిపిస్తోంది.
🏠 Home