విలేకరిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడితో సమానం.
CM9NEWS: కావలి: బాధ్యతాయుతమైన పత్రికా విలేకరిపై దాడి జరగడం దురదృష్టకరమని కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని వైకుంఠపురంలో దాడికి గురైన ఈనాడు విలేకరి సుబ్బారావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే జర్నలిస్టుల ప్రధాన బాధ్యతని, వార్తలపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలేనని పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు తమకు అనుకూలంగా లేవనే కారణంతోనో, వ్యక్తిగత కక్షలతోనో విలేకరులపై భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
గతంలో సీనియర్ విలేకరి నాగేశ్వరరావుపై కూడా ఇదే తరహాలో దాడి జరిగిందని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళనకరమన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజం గొంతు నొక్కాలని చూడటం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
సుబ్బారావు స్వల్ప గాయాలతో బయటపడటం అదృష్టకరమని పేర్కొంటూ, ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.