కావలి మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్!
CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. కోర్టు వివాదాల కారణంగా తొలివిడతలో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలకు రెండో విడతలో నిర్వహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 14వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కావలి మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్ (ఓసీ) కేటగిరీకి కేటాయించగా, విలీన గ్రామాలతో కలిపి మొత్తం 44 వార్డులుగా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది.
చైర్మన్ స్థానం కూటమి పక్షాల మధ్య బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీలో ఆశావహుల సందడి మొదలైంది. మరోవైపు వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి కూడా పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు ఉండటంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, వైసీపీకి చెందిన ఆశావహులు ఆయా పార్టీల కీలక నేతల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక కావలి మున్సిపాలిటీలో సుమారు 85433 వేల మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం. దీంతో మహిళా ఓటర్ల తీర్పు ఎన్నికల్లో కీలకంగా మారనుంది.
మొత్తంగా నామినేషన్ల ప్రక్రియకు సమయం దగ్గరపడుతుండటంతో కావలిలో రాజకీయ సందడి ఊపందుకుంది. 44 వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలతో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు? చైర్మన్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.