🏠 cm9news.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 8:24 pm Posted by : CM9NEWS

కావలిలో బీజేపీ జెండా ఎగురవేస్తాం.

News Image
CM9NEWS: కావలి: నెల్లూరు జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసి, జిల్లాను పార్టీకి కంచుకోటగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కావలిలో నిర్వహించిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కావలి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చైర్మన్ అభ్యర్థిని గెలిపించి పార్టీకి విజయాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొలివిడతలో నెల్లూరు కార్పొరేషన్ మేయర్ సీటును బీజేపీకి కేటాయించాలని కోరామని, అయితే అది సాధ్యం కాలేదని తెలిపారు. కావలి మున్సిపల్ చైర్మన్ స్థానం బీజేపీకి కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో తొలివిడతలో బీజేపీకి కేటాయించిన స్థానాలను పార్టీ కైవసం చేసుకుందని, అదే ఉత్సాహంతో కావలిలోనూ బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుండా వైసీపీకి ఓటు వేస్తే ఆ ఓటు వృథా అవుతుందని వ్యాఖ్యానించారు.

కావలి పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న నిధులు సద్వినియోగం కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో బీజేపీకి బలమైన పునాది ఉందని, రానున్న రోజుల్లో పార్టీని మరింత విస్తరించి జిల్లాను బీజేపీ అడ్డాగా మారుస్తామని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
🏠 Home