బృందావనం కాలనీలో వైసీపీ ఇంటింటి ప్రచారం.
CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీ 25వ వార్డు పరిధిలోని బృందావనం కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో ప్రజల ముందుకు వచ్చానని, తనను మున్సిపల్ చైర్మన్‌గా, తన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డిని కౌన్సిలర్‌గా గెలిపించి ఆశీర్వదించాలని శివకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ, రెండు ఓట్లను ప్యాన్ గుర్తుపై వేసి కేతిరెడ్డి సోదరులను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.