కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్‌కు బీజేపీ బీ-ఫారం అందజేత.
CM9NEWS: కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి భారతీయ జనతా పార్టీ (ఎన్డీఏ) అభ్యర్థిగా బరిలో నిలిచిన గుండ్లపల్లి భరత్ కుమార్‌కు పార్టీ తరఫున అధికారిక బీ-ఫారం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి చేతుల మీదుగా భరత్ కుమార్ బీ-ఫారంను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం గుండ్లపల్లి భరత్ కుమార్ కావలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ-ఫారంను సమర్పించారు.
ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ తనకు పార్టీ తరఫున బీ-ఫారం అందజేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు, సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్‌తో పాటు జిల్లా సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.