స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి, ఎస్పీ, ఎస్టీలకు మెజారిటీ స్థానాలు కేటాయించాలి!
CM9NEWS: కావలి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మెజారిటీ స్థానాలు కేటాయించాలని బీసీ ఐక్య వేదిక కావలి నియోజకవర్గ కన్వీనర్, న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి, బీసీ ఐక్యత భవన్ అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోతే, ఆయా వర్గాల నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. శుక్రవారం కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా, ఓపెన్ కేటగిరీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన అవకాశాలు...