మున్సిపల్ చైర్మన్ రేసులో పల్లపు చిట్టిబాబు సతీమణి సుజాత..!

CM9NEWS: కావలి మున్సిపల్ చైర్మన్ పదవిపై బీజేపీలో ఆశావహుల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తన సతీమణి మన్నవ సుజాతకు పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిత్వం కల్పించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు పల్లపు చిట్టిబాబు పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా RSS, ABVP, BJYM, BJPలతో అనుబంధం కలిగి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న తన రాజకీయ అనుభవంతో పాటు,తన సతీమణి సుజాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆ సామాజిక వర్గంలోనూ తమ కుటుంబానికి ఉన్న పరిచయాలు, సంబంధాలు పార్టీకి అదనపు బలంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. వివిధ సామాజిక వర్గాలతో ఉన్న అనుబంధం, పార్టీ...