సత్యవోలు సర్పంచ్ బరిలో గద్దె వెంకటలక్ష్మి..
CM9NEWS కొండాపురం :కొండాపురం మండలం సత్యవోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గద్దె వెంకటలక్ష్మి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ఆమె కుమారుడు, ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గద్దె రామకృష్ణ గురువారం అమెరికా నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు.గత పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం స్వంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని ఆయన తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సత్యవోలు నుంచి మలకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించినట్లు గుర్తుచేశారు. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయానికి అహర్నిశలు కృషి చేశానని పేర్కొన్నారు. గ్రామ...