కావలి మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్!
CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. కోర్టు వివాదాల కారణంగా తొలివిడతలో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలకు రెండో విడతలో నిర్వహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కావలి మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్ (ఓసీ) కేటగిరీకి కేటాయించగా, విలీన గ్రామాలతో కలిపి మొత్తం 44 వార్డులుగా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు....