కావలి వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి!

CM9NEWS: కావలి: కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. కావలి వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గత 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న కేతిరెడ్డి శివకుమార్ రెడ్డికి పార్టీలో సౌమ్యుడిగా, వివాదరహితుడిగా మంచి గుర్తింపు ఉంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ పట్టణ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల బరిలో ఆయన తొలిసారిగా పోటీ చేయబోతుండటం విశేషం. వైసీపీ చైర్మన్ అభ్యర్థిని...