కావలి 10 వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మలిశెట్టి విజయలక్ష్మి..

CM9NEWS కావలి :కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో పదో వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున మలిశెట్టి విజయలక్ష్మి శనివారం మున్సిపాలిటీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. పుర పోరులో పోటీ చేస్తున్న అభ్యర్థులలో తొలి నామినేషన్ గా మలిశెట్టి విజయలక్ష్మి కావటం విశేషం! గతంలో కూడా ఆమె 34 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసి ఉన్నారు. వార్డుల పునర్విభజన లో భాగంగా 34 వార్తను 10 వార్డుగా కేటాయించటం జరిగింది.