కావలిలో బీజేపీ జెండా ఎగురవేస్తాం.

CM9NEWS: కావలి: నెల్లూరు జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసి, జిల్లాను పార్టీకి కంచుకోటగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కావలిలో నిర్వహించిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కావలి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చైర్మన్ అభ్యర్థిని గెలిపించి పార్టీకి విజయాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొలివిడతలో నెల్లూరు కార్పొరేషన్ మేయర్ సీటును బీజేపీకి కేటాయించాలని కోరామని, అయితే అది సాధ్యం కాలేదని తెలిపారు. కావలి మున్సిపల్ చైర్మన్ స్థానం బీజేపీకి కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తొలివిడతలో బీజేపీకి కేటాయించిన స్థానాలను పార్టీ...