వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నామినేషన్!
కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం కావలి మున్సిపల్ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న ఆయన, రిటర్నింగ్ అధికారి వద్ద తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సౌమ్యుడు, వివాదరహితుడైన కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని కావలి పట్టణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు శివకుమార్ రెడ్డి రాజకీయ ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు....