కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్కు బీజేపీ బీ-ఫారం అందజేత.
CM9NEWS: కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి భారతీయ జనతా పార్టీ (ఎన్డీఏ) అభ్యర్థిగా బరిలో నిలిచిన గుండ్లపల్లి భరత్ కుమార్కు పార్టీ తరఫున అధికారిక బీ-ఫారం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి చేతుల మీదుగా భరత్ కుమార్ బీ-ఫారంను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం గుండ్లపల్లి భరత్ కుమార్ కావలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ-ఫారంను సమర్పించారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ తనకు పార్టీ తరఫున బీ-ఫారం అందజేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు,...