వాకర్స్‌ను కలిసిన చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్.

CM9NEWS:కావలి:కావలి అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని కూటమి పార్టీల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ పట్టణ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం జవహర్ భారతి గ్రౌండ్‌లో వాకర్స్‌ను ఆయన కలిశారు. వారితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తనకు కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించారని తెలిపారు. కావలి అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి...