Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అధికార పక్షంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి..

అధికార పక్షంపై  నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి..

CM9NEWS: నెల్లూరు జిల్లా కావలి రాజకీయాల్లో మరోసారి మాటల మంటలు రాజుకున్నాయి..! స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పక్షంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, భయపెట్టి, దాడులు చేసి, అల్లర్లు సృష్టించి నామినేషన్లను అడ్డుకోవడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే నెల్లూరు జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
కావలిలో గత రెండేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారని ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజలు మోసపూరిత హామీలకు లొంగకుండా, గతంలో తమ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: