Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కావలిలో పరిషత్ ఎన్నికలలో 9 స్ధానాలలో ఏకగ్రీవం.. 38 స్థానాల్లో రసవత్తర పోరు!

Author
Posted By CM9NEWS
| 27 Oct 2026, 08:21 PM | Politics, ఆంధ్రప్రదేశ్
కావలిలో పరిషత్ ఎన్నికలలో 9 స్ధానాలలో ఏకగ్రీవం.. 38 స్థానాల్లో రసవత్తర పోరు!

CM9NEWS: కావలి నియోజకవర్గంలో మండల పరిషత్ ఎన్నికల సందడి మొదలైంది. నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మిగిలిన 38 స్థానాల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.కావలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో మొత్తం 47 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా, 83 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి 33 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 37 మంది, జనసేన పార్టీ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, బీసీవై పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో అభ్యర్థులు తమ తమ సెగ్మెంట్ల పరిధిలో ఓటర్లను కలుసుకుని మద్దతు కూడగట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటీతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొనగా, రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: