Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ నామినేషన్

Author
Posted By CM9NEWS
| 16 Nov 2026, 11:30 PM |
కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ నామినేషన్

కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన భరత్ కుమార్ యాదవ్ విద్యార్థి దశ నుంచే ప్రజా జీవితంలో చురుకుగా వ్యవహరించారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వివిధ పదవులు నిర్వహించారు. బీజేపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.

అదేవిధంగా రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు. అలానే కావలి పట్టణంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్‌గా, ఇన్‌ఛార్జి చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మున్సిపల్ పాలనపై అనుభవం, పట్టణ సమస్యలపై అవగాహన కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఈ సందర్భంగా భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై ఆదరాభిమానాలు చూపించి ఓటు వేసి గెలిపిస్తే, ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి సహకారంతో కావలి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: