Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మున్సిపల్ చైర్మన్ రేసులో పల్లపు చిట్టిబాబు సతీమణి సుజాత..!

Author
Posted By CM9NEWS
| 06 Nov 2026, 06:25 PM | ANDHRA PRADESH
మున్సిపల్ చైర్మన్ రేసులో పల్లపు చిట్టిబాబు సతీమణి సుజాత..!

CM9NEWS: కావలి మున్సిపల్ చైర్మన్ పదవిపై బీజేపీలో ఆశావహుల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తన సతీమణి మన్నవ సుజాతకు పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిత్వం కల్పించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు పల్లపు చిట్టిబాబు పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా RSS, ABVP, BJYM, BJPలతో అనుబంధం కలిగి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న తన రాజకీయ అనుభవంతో పాటు,తన సతీమణి సుజాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆ సామాజిక వర్గంలోనూ తమ కుటుంబానికి ఉన్న పరిచయాలు, సంబంధాలు పార్టీకి అదనపు బలంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. వివిధ సామాజిక వర్గాలతో ఉన్న అనుబంధం, పార్టీ కార్యకర్తల మద్దతుతో సుజాతకు అవకాశం కల్పిస్తే విజయానికి అనుకూలమైన అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.1978లో RSS కార్యకర్తగా తన రాజకీయ, సామాజిక ప్రస్థానాన్ని ప్రారంభించిన చిట్టిబాబు, 1983 నుంచి ABVPలో చురుకుగా పనిచేశారు. విద్యార్థి దశలో పలు ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు. 1987లో జవహర్ భారతి కళాశాల విద్యార్థి ఎన్నికల్లో ABVP తరఫున కార్యదర్శిగా విజయం సాధించారు.
అనంతరం 1992లో BJYM జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1995లో కావలి పట్టణంలో బీజేపీ తరఫున కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1997లో కావలి పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2010 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు.
పార్టీ అభ్యర్థుల విజయానికి, కావలి పట్టణంలో బీజేపీ బలోపేతానికి నిరంతరం కృషి చేసినట్లు చిట్టిబాబు తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. వివిధ సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాజకీయంగా, సామాజికంగా సమన్వయానికి ప్రాధాన్యత ఇచ్చానన్నారు. అలాగే కావలి ఆర్టీసీ డిపోలో BMS అనుబంధ కార్మిక సంఘం ఏర్పాటుకు కూడా కృషి చేసినట్లు వివరించారు.
ఈ నేపథ్యంలో రాబోయే కావలి మున్సిపల్ ఎన్నికల్లో తన సతీమణి మన్నం సుజాతకు బీజేపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ తన కుటుంబానికి అవకాశం ఇస్తే, తన రాజకీయ అనుభవం, పార్టీ కార్యకర్తలతో ఉన్న అనుబంధం, వివిధ సామాజిక వర్గాల్లో ఉన్న పరిచయాలు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంతో ఉన్న కుటుంబ సంబంధాలను సమన్వయం చేసుకుంటూ ఆమె విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్త కుటుంబానికి తగిన గుర్తింపు లభించాలన్నదే తన అభ్యర్థన అని, పార్టీ అధిష్ఠానం తన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి సతీమణి సుజాతకు అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు పల్లపు చిట్టిబాబు పేర్కొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: