Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వాకర్స్‌ను కలిసిన చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్.

Author
Posted By CM9NEWS
| 23 Nov 2026, 12:07 AM | ANDHRA PRADESH, Politics, ఆంధ్రప్రదేశ్
వాకర్స్‌ను కలిసిన చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్.

CM9NEWS:కావలి:కావలి అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని కూటమి పార్టీల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ పట్టణ ప్రజలను కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం జవహర్ భారతి గ్రౌండ్‌లో వాకర్స్‌ను ఆయన కలిశారు. వారితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తనకు కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించారని తెలిపారు. కావలి అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు.

వాకర్స్‌ను కలిసిన చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్. - Additional Image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో స్థానిక ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి కావలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కావలి పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని, ఈ దిశగా పట్టణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థుల గెలుపు అవసరమని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి కావలి అభివృద్ధికి సహకరించాలని భరత్ కుమార్ వాకర్స్‌కు విజ్ఞప్తి చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: