Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ లలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి. మాజీ మంత్రి కాకాణి.

కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ లలో  వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి. మాజీ మంత్రి కాకాణి.

  • కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ లలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి
  • అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేసిన కాకాణి, ప్రతాప్ కుమార్ రెడ్డి

CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీ అల్లూరు నగర పంచాయతీ లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు వారు పార్టీ బీఫామ్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ లలో  వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి. మాజీ మంత్రి కాకాణి. - Additional Image

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై చేయి వేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ధైర్యం, దమ్ము గురించి టీడీపీ నాయకులు మాట్లాడటం సరికాదన్నారు. పోలీసులను పక్కన పెట్టి రావాలని, ఎక్కడైనా తేల్చుకుందామని సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనను సౌమ్యుడిగా భావించి తక్కువ అంచనా వేయవద్దని, అవసరమైతే తన వైఖరి ఎలా ఉంటుందో చూపిస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు అల్లూరు నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థి యాటకిరి పూర్ణచంద్రరావును, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాబోయేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ గెలుపొందిన ప్రతి వార్డులోనూ ఆయా వార్డు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగానే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: