Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నామినేషన్!

వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నామినేషన్!

కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం కావలి మున్సిపల్ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న ఆయన, రిటర్నింగ్ అధికారి వద్ద తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సౌమ్యుడు, వివాదరహితుడైన కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని కావలి పట్టణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు శివకుమార్ రెడ్డి రాజకీయ ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. ఆయన అభ్యర్థిత్వానికి కావలిలో పార్టీలకు అతీతంగా ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కావలి పట్టణ ప్రజలు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 44 మంది అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: