Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్‌కు బీజేపీ బీ-ఫారం అందజేత.

కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్‌కు బీజేపీ బీ-ఫారం అందజేత.

CM9NEWS: కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి భారతీయ జనతా పార్టీ (ఎన్డీఏ) అభ్యర్థిగా బరిలో నిలిచిన గుండ్లపల్లి భరత్ కుమార్‌కు పార్టీ తరఫున అధికారిక బీ-ఫారం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి చేతుల మీదుగా భరత్ కుమార్ బీ-ఫారంను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం గుండ్లపల్లి భరత్ కుమార్ కావలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ-ఫారంను సమర్పించారు.

ఇవి కూడా చదవండి

కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్‌కు బీజేపీ బీ-ఫారం అందజేత. - Additional Image

ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ తనకు పార్టీ తరఫున బీ-ఫారం అందజేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు, సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్‌తో పాటు జిల్లా సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: