Home

వాకర్స్‌ను కలిసిన చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్.

CM9NEWS:కావలి:కావలి అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని కూటమి పార్టీల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ పట్టణ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం జవహర్ భారతి గ్రౌండ్‌లో వాకర్స్‌ను ఆయన కలిశారు. వారితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తనకు కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం...

కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్‌కు బీజేపీ బీ-ఫారం అందజేత.

CM9NEWS: కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి భారతీయ జనతా పార్టీ (ఎన్డీఏ) అభ్యర్థిగా బరిలో నిలిచిన గుండ్లపల్లి భరత్ కుమార్‌కు పార్టీ తరఫున అధికారిక బీ-ఫారం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి చేతుల మీదుగా భరత్ కుమార్ బీ-ఫారంను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం గుండ్లపల్లి భరత్ కుమార్ కావలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ-ఫారంను సమర్పించారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ తనకు పార్టీ తరఫున...

బృందావనం కాలనీలో వైసీపీ ఇంటింటి ప్రచారం.

CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీ 25వ వార్డు పరిధిలోని బృందావనం కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో ప్రజల ముందుకు వచ్చానని, తనను మున్సిపల్ చైర్మన్‌గా, తన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డిని కౌన్సిలర్‌గా గెలిపించి ఆశీర్వదించాలని శివకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి...

కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ లలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి. మాజీ మంత్రి కాకాణి.

ముఖ్యమైన పాయింట్స్:కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ లలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలిఅభ్యర్థులకు బీఫామ్‌లు అందజేసిన కాకాణి, ప్రతాప్ కుమార్ రెడ్డి CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీ అల్లూరు నగర పంచాయతీ లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు వారు పార్టీ...

వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నామినేషన్!

కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం కావలి మున్సిపల్ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న ఆయన, రిటర్నింగ్ అధికారి వద్ద తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సౌమ్యుడు, వివాదరహితుడైన కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని కావలి పట్టణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర...

కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ నామినేషన్

కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన భరత్ కుమార్ యాదవ్ విద్యార్థి దశ నుంచే ప్రజా జీవితంలో చురుకుగా వ్యవహరించారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో పట్టణ,...

కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ నామినేషన్

కావలి: కావలి మున్సిపల్ చైర్మన్ పదవికి కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన భరత్ కుమార్ యాదవ్ విద్యార్థి దశ నుంచే ప్రజా జీవితంలో చురుకుగా వ్యవహరించారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో పట్టణ,...

కావలిలో బీజేపీ జెండా ఎగురవేస్తాం.

CM9NEWS: కావలి: నెల్లూరు జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసి, జిల్లాను పార్టీకి కంచుకోటగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కావలిలో నిర్వహించిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కావలి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చైర్మన్ అభ్యర్థిని గెలిపించి పార్టీకి విజయాన్ని అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొలివిడతలో నెల్లూరు కార్పొరేషన్ మేయర్ సీటును బీజేపీకి కేటాయించాలని కోరామని, అయితే అది సాధ్యం కాలేదని తెలిపారు. కావలి మున్సిపల్...

కావలిలో వైసీపి తరుపున తొలి నామినేషన్ దాఖలు చేసిన 38 వార్డు అభ్యర్థి నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి.

CM9NEWS: కావలిలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు కోలాహలంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి నామినేషన్ 38 వార్డుకు చెందిన నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. గతంలో ఆయన సతీమణి నెల్లూరు సీతారామమ్మ కౌన్సిలర్ గా ఉన్నారు . గతంలో 25 వార్డుగా ఉన్న ఈ వార్డును వార్డుల పునర్విభజన లో 38 వార్డు చేసారు. అయితే వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ కావలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్నట్లు...

కావలిలో వైసీపి తరుపున తొలి నామినేషన్ దాఖలు చేసిన 38 వార్డు అభ్యర్థి నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి.

CM9NEWS: కావలిలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు కోలాహలంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి నామినేషన్ 38 వార్డుకు చెందిన నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. గతంలో ఆయన సతీమణి నెల్లూరు సీతారామమ్మ కౌన్సిలర్ గా ఉన్నారు . గతంలో 25 వార్డుగా ఉన్న ఈ వార్డును వార్డుల పునర్విభజన లో 38 వార్డు చేసారు. అయితే వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ కావలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్నట్లు...

39వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసూన నామినేషన్ దాఖలు

CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. సుమారు ఏడేళ్ల విరామం తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 39వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రసూన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి...

కావలి 10 వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మలిశెట్టి విజయలక్ష్మి..

CM9NEWS కావలి :కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో పదో వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున మలిశెట్టి విజయలక్ష్మి శనివారం మున్సిపాలిటీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. పుర పోరులో పోటీ చేస్తున్న అభ్యర్థులలో తొలి నామినేషన్ గా మలిశెట్టి విజయలక్ష్మి కావటం విశేషం! గతంలో కూడా ఆమె 34 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసి ఉన్నారు. వార్డుల పునర్విభజన లో భాగంగా 34 వార్తను 10 వార్డుగా కేటాయించటం జరిగింది.

కావలి వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి!

CM9NEWS: కావలి: కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. కావలి వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గత 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న కేతిరెడ్డి శివకుమార్ రెడ్డికి పార్టీలో సౌమ్యుడిగా, వివాదరహితుడిగా మంచి గుర్తింపు ఉంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ పట్టణ స్థాయిలో తనకంటూ...

కావలి మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్!

CM9NEWS: కావలి: కావలి మున్సిపాలిటీలో ఎన్నికల సందడి మొదలైంది. కోర్టు వివాదాల కారణంగా తొలివిడతలో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలకు రెండో విడతలో నిర్వహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అదే నెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కావలి మున్సిపల్...

సత్యవోలు సర్పంచ్ బరిలో గద్దె వెంకటలక్ష్మి..

CM9NEWS కొండాపురం :కొండాపురం మండలం సత్యవోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గద్దె వెంకటలక్ష్మి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ఆమె కుమారుడు, ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గద్దె రామకృష్ణ గురువారం అమెరికా నుంచి ఒక ప్రకటనలో వెల్లడించారు.గత పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం స్వంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని ఆయన తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సత్యవోలు నుంచి మలకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం...

విలేకరిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడితో సమానం.

CM9NEWS: కావలి: బాధ్యతాయుతమైన పత్రికా విలేకరిపై దాడి జరగడం దురదృష్టకరమని కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని వైకుంఠపురంలో దాడికి గురైన ఈనాడు విలేకరి సుబ్బారావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే జర్నలిస్టుల ప్రధాన బాధ్యతని, వార్తలపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలేనని పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు తమకు అనుకూలంగా లేవనే కారణంతోనో, వ్యక్తిగత కక్షలతోనో విలేకరులపై భౌతిక దాడులకు దిగడం...

మున్సిపల్ చైర్మన్ రేసులో పల్లపు చిట్టిబాబు సతీమణి సుజాత..!

CM9NEWS: కావలి మున్సిపల్ చైర్మన్ పదవిపై బీజేపీలో ఆశావహుల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తన సతీమణి మన్నవ సుజాతకు పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిత్వం కల్పించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు పల్లపు చిట్టిబాబు పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా RSS, ABVP, BJYM, BJPలతో అనుబంధం కలిగి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న తన రాజకీయ అనుభవంతో పాటు,తన సతీమణి సుజాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆ సామాజిక వర్గంలోనూ తమ కుటుంబానికి...

పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం

CM9NEWS : కావలి నియోజకవర్గంలో రేపు జరగనున్న పరిషత్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 47 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా, వీటిలో ఆరు సెగ్మెంట్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 41 ఎంపీటీసీ స్థానాలతో పాటు నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,34,051 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం నాలుగు మండలాల పరిధిలో 190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల నిర్వహణకు వెయ్యి మందికి పైగా సిబ్బందిని...

ఆమదాలదిన్నెలో ఉప్పాల కిరణ్‌కు ప్రజల బ్రహ్మరథం!

CM9NEWS: కావలి సంస్థల ఎన్నికల ప్రచారంలో కావలి మండలం ఆమదాలదిన్నె ఎంపీటీసీ అభ్యర్థి ఉప్పాల కిరణ్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆమదాలదిన్నె గ్రామంలో ఆయన నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామంలో అడుగడుగునా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఉప్పాల కిరణ్ మాట్లాడుతూ.. మీ తమ్ముడిగా, మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వచ్చానని, తనను ఆశీర్వదించి ప్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే జెడ్పీటీసీ...

కావలిలో పరిషత్ ఎన్నికలలో 9 స్ధానాలలో ఏకగ్రీవం.. 38 స్థానాల్లో రసవత్తర పోరు!

CM9NEWS: కావలి నియోజకవర్గంలో మండల పరిషత్ ఎన్నికల సందడి మొదలైంది. నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మిగిలిన 38 స్థానాల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.కావలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో మొత్తం 47 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా, 83 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి 33 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 37...